పహల్గామ్ ఉగ్ర దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ తో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది.
ఇందులో జైషే మొహమ్మద్ కేంద్ర కార్యాలయం కూడా ఉంది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాక్ పై భారత్ చేసిన దాడిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఇటీవల అమరావతి సభలో తాను ప్రధాని మోదీ సమక్షంలో చేసిన వీడియోను ఆయన నేడు ఎక్స్ లో పంచుకున్నారు.
“పాకిస్థాన్ గీత దాటింది. అమాయకులను చంపింది. చాలా పెద్ద తప్పు చేసింది. ఒక పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్ లు వచ్చినా భారతదేశంపై మొలచిన గడ్డి కూడా పీకలేరు.
వంద పాకిస్థాన్ లకు సమాధానం చెప్పే ఒక్క మిస్సైల్ మన దగ్గర ఉంది. ఆ మిస్సైల్ ఏంటో తెలుసా? ‘నమో’. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు” అని లోకేశ్ భావేద్వేగంతో మాట్లాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేశారు.


మండలికి ఎవరు తాగొచ్చారు.. యనమల వ్యాఖ్యలపై బొత్స ఫైర్