ఏపీలో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే అక్కడ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి… తాజాగా.. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ బదిలీ ఎపిసోడులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది… పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ బదిలీ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ ఏం బదిలీలు చేసుకున్నా.. ఏం చేసుకున్నా తాము పట్టించుకోమని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా…. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అత్యవసర భేటీ అయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణ విషయమై ఉద్యోగ సంఘల నేతలతో చర్చ నిర్వహించనున్నారు. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ విషయమై అభ్యంతరాలు తెలిపారు ఉద్యోగులు. ఈ భేటీ సందర్భంగా తమ అభ్యంతరాలను.. సూచనలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లనున్నాయి ఉద్యోగ సంఘాలు. రేపు ఎస్ఈసీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో సీఎస్- ఉద్యోగ సంఘాల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
previous post
సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండి.. సీఎం జగన్ కు లోకేశ్ సూచన!