కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ , నిరుద్యోగం సమస్యలపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్లో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ రోడ్డులో రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి.
అయితే పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని బ్లాక్ చేశాయి. ఎవరూ ముందుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ మార్గంలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీపుకుని పోలీస్ లైన్స్‌లోని కింగ్స్‌వే క్యాంపునకు తరలింంచారు.
ప్రజా సమస్యలను లేవనెత్తడమే తమ కర్తవ్యమని.. ఈ విధులు నిర్వర్తించినందుకు తమ ఎంపీలను అదుపులోకి తీసుకుంటాన్నరని రాహుల్ ఆరోపించారు.
సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి: కన్నా