పశ్చిమగోదావరిలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఎలాక్ట్రోరల్ ఓట్లకు సంబంధించి దాఖలైన పిటీషన్ పై విచారణ చేసిన ఏపీ హైకోర్టు.. ఎన్నికలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతకుముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గతేడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ విడుదలపై ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. దీనిపై తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచింది ఏపీ హైకోర్టు.
ఉద్యమ నాయకుడు సీఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని