telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేంద్రంపై పోరుకు సిద్ధం.. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర సర్కారుపై పోరాటానికి టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

బీజేపీ సర్కార్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరుకు సిద్ధమతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

తెలంగాణకు నష్టం చేసే విధంగా కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై ఉభయ సభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు.

ఉపాధి హామీ పథకం అమల్లో ద్వంద్వ వైఖరిని నిలదీయాలని పేర్కొన్నారు. రూపాయి పతనంతోపాటు ఆర్థిక రంగంలో కేంద్రం అసంబద్ధ విధానాలపై పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్ సూచించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌తో కలిసి వచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కలుపుకొని పోవాలని నిర్ణయించారు.

Related posts