telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వ్యవసాయం ద్వారా కోట్లాది మందికి ఉపాధి: వ్యవసాయ మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విత్తన మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు.సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు.

భవిష్యత్తులో రాష్ట్రంలో వ్యవసాయం ద్వారా కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువత వ్యవసాయంపై దృష్టిసారించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన సలహాలు అందించటానికి కొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Related posts