telugu navyamedia
తెలంగాణ వార్తలు

గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై ఈటెల పోటీ..

*తెలంగాణ‌లో బెంగాల్ ఫార్ములా..
*కేసీఆరే తో ఈటెల పోటీ
*గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై ఈటెల పోటీ..
*తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలంటే ఈగోలు పక్కనబెట్టి లక్ష్యం కోసం పనిచేయాలి

తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నెలకొంది . టీఆర్ఎస్‌ను బలంగా దెబ్బకొట్టాలంటే ముందుగా సీఎం కేసీఆర్‌ను ఓడించాల‌ని మాజీ మంత్రి ,బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సరికొత్త వ్యూహాన్ని అమ‌లుచేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఈటల రాజేందర్​ సంచలన ప్రకటన చేశారు.. బంగాల్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని వ్యాఖ్యానించారు. శనివారం మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. నా ప్రస్తానం మెదలైందే గజ్వేల్ నుంచి,గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని ముందే చెప్పాను.

అర్జునుడికి పక్షి తల మాదిరి కేసీఆర్ మాత్రమే మాకు కన్పించాలని అన్నారు. ప్రశ్నించే తత్వం సహజంగానే తెలంగాణ మట్టిలో ఉంటోందని, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు.

టీఆర్ఎస్ గ్రాఫ్ జారుడు బండ మాదిరి పడిపోతోందని ఈటల అన్నారు. బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఆర్ చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా? టీఆర్ఎస్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని ఈటల స్పష్టం చేశారు.

బీజేపీలోకి భారీ చేరికలుంటాయని, చేరికల కోసం ఆపరేషన్ ఆకర్ష్‌ నడుస్తోందని ఆయన తెలిపారు.అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేగా కూడా ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయిందని ఈటల రాజేందర్ తెలిపారు.అసలు కేసీఆర్ కే టికెట్ కట్ చేయాలని ఆయన అన్నారు.

పశ్చిమ బంగాలో సువేందు అధికారి దృశ్యం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని తెలిపారు. బంగాల్‌లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని వ్యాఖ్యానించారు.

Related posts