ఎలాగైతేనేమి భారతదేశంలో మాదకద్రవ్యాల ను అందుబాటులోకి తేవాలనే పట్టుదల కనిపిస్తుంది, ఎవరో ఆ ప్రబుద్ధులు కానీ, వారి ప్రయత్నాలు మాత్రం పట్టువిడని విక్రమార్కుడిలా సాగుతూనే ఉన్నాయి. దేశంలో మాదకద్రవ్యాలు అధికారులు పట్టుకునే కొద్దీ భారీగా దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో 257 కిలోల గంజాయి పట్టుకున్నారు అధికారులు. భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌చంద్ర ఈ విషయాలను మీడియా కు వెల్లడించారు. ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ఏజెన్సీ గ్రామంలో గంజాయిని కొనుగోలు చేసి కారులో మహబూబాబాద్‌కు తరలిస్తుండగా, భద్రాచలం పోలీస్‌లు తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు.
మానుకోటకు చెందిన లూనావత్ బానుచందర్, కొర్రా బావ్‌సింగ్, జాటోత్ సునిల్, పాషాలు ఒడిషాలోని మారుమూల ప్రాంతంలో 257 కిలోల గంజాయి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ గంజాయిని ప్యాకెట్లలో భద్రపరిచి అనుమానం రాకుండా కారులో భద్రాచలం మీదుగా మహబూబాబాద్‌కు తరలించేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిపారు. ఈ క్రమంలో భద్రాచలం చేరుకున్న సమయంలో బ్రిడ్జి రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీస్‌లు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఇన్నోవా వాహనం ఆపి తనిఖీ చేసే ప్రయత్నం చేయగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. అప్రమత్తమైన పోలీస్‌లు వెంటనే ఆ వాహనాన్ని వెంబడించి గోదావరి బ్రిడ్జి మధ్యలో అడ్డుకొని వాహనాన్ని తనిఖీ చేసినట్లు వివరించారు.
అందులో గంజాయి ఉన్న విషయాన్ని గమనించి పూర్తిగా లెక్కించగా 257 కిలోలు ఉన్నట్లు, దీని విలువ రూ.38.58 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న సంఘటనలో మొత్తం నలుగురు నింధితుల్లో లూనావత్ భానుచందర్‌ను అరెస్ట్ చేయగా, మిగిలిన ముగ్గురు నింధితులు పరారీలో ఉన్నట్లు ఏఎస్‌పీ రాజేష్‌చంద్ర వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో భద్రాచలం సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐలు మహేష్, రాంబాబు, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ కేసులో దీపికా… డ్రగ్స్ వాడకానికి పర్యావసానమే డిప్రెషన్ అంటున్న కంగనా