telugu navyamedia
సినిమా వార్తలు

అలియా భట్ సీతగా మారిన వీడియో..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూ. ఎన్టీఆర్ న‌టిస్తున్న బిగ్గెస్ట్ మల్టీసారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ధర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్​దేవగణ్​, శ్రియ, ఆలియాభట్​ కూడా కీలక పాత్ర పోషించారు.

Alia Bhatt on shooting for SS Rajamouli's 'RRR'

ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోష‌ల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి డిసెంబరు 9న ‘ఆర్​ఆర్​ఆర్’​ ట్రైలర్​ విడుదల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RRR Alia Bhatt look Sita from SS Rajamouli film is perfect treat for fans on 28th birthday Twitterati reaction | Celebrities News – India TV

ఈ నేప‌థ్యంలో మూవీ ప్రొమోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రోజుకో అప్డేట్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది మూవీ టీం..

When will Alia be back on RRR sets?

అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచి సీత పాత్రలో ఒదిగిపోయే వరకు చూపించారు. అందులో అలియా పోషిస్తున్న సీత పాత‍్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్‌ను చూపించారు. వీడియోలోని బిహైండ్‌ సీన్స్‌లో అలియా భట్‌ క్యూట్‌ క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది. ఇందులో పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంటుంది.

Alia Bhatt gives her take on live-in relationships and kids

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇందులో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సీత పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం.

Related posts