స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెబంర్ 17, 2021న విడుదల కానుంది.
ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో పుష్ప నుంచి వరుస అప్డే్ట్స్ ఇస్తున్నారు మేకర్స్. పుష్ప’ ఫోర్త్ సింగిల్ లిరికల్ ప్రొమో ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ను చిత్రబృందం విడుదల చేసింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఫోర్త్ సింగిల్ లిరికల్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఈ పాటలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్లో మరోసారి అదరగొట్టాడు. నవంబర్ 19న ఉదయం 11:07 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి’ ‘సామీ సామీ’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇందులో సునీల్, అనసూయ పవర్ఫుల్ పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.