telugu navyamedia
తెలంగాణ వార్తలు

న‌వంబ‌ర్ 18న ఇందిరాపార్క్‌ దగ్గర మహా ధర్నా..

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టమైన పాలసీ ప్రకటించేంత వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని, తాము ఉద్యమ కారులమని…కేంద్రంపై కొట్లాడటంపై కొత్తేమీ కాదన్నారు కేసీఆర్‌. 

ఏడాదికి ఎన్ని వడ్లు కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు. యాసంగిలో వరి వేయమంటారా? వద్దా? అని ప్రధానికి , వ్యవసాయ శాఖ మంత్రికి రేపు ఉదయం లేఖ రాయబోతున్నాని చెప్పారు.

తెలంగాణ ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా చెప్పాలని ప్రశ్నించారు. యాసంగిలో వరి వేయాలని బండి సంజయ్‌ చెప్పిన మాట మీద ఉన్నారా? లేదా? స్పష్టం చేయాలన్నారు. చెప్పిన మాట మీద నిబలడితే కేంద్రం కొనుగోలు చేస్తుందని, అలా కాకుండా పొరపాటున అన్నానని చెబితే ముక్కు నేలకు రాయాలని అన్నారు.

రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలిని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యవహారాన్ని క్షమించేది లేదని, కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నా ఎందుకు?. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కాదా.. వాళ్ళు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ఎంధుకు రాకూడదు’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

“రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 18న ఇందిరా పార్క్‌లో ధర్నా చేస్తాం. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా ఈ ధర్నాలో పాల్గొంటారు.  ధర్నా తర్వాత రెండు రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం, పార్లమెంట్‌లోనూ, అన్ని చోట్లా వెంటాడతామని వార్నింగ్‌ ఇచ్చారు కేసీఆర్.

అంత‌కుముందు టీఆర్ఎస్ ఎల్పీ భేటీ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు శాలువా క‌ప్పి పుష్పగుచ్ఛాలు అందించి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంక‌ట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ మంగ‌ళ‌వారం అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి నామినేష‌న్ల‌ను స‌మ‌ర్పించారు.

Related posts