telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఛపాక్” ట్రైలర్ ఎఫెక్ట్… అనుకోని వ్యక్తి నుంచి దీపికకు ఊహించని ట్వీట్

Chhapak

దీపికా పదుకునే నటించిన “ఛపాక్” సినిమా ట్రైలర్ మంగళవారం రిలీజైన విషయం తెలిసిందే. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా “రాజీ” ఫేమ్‌ మేఘన్‌ గుల్జర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ అగర్వాల్‌ పాత్రలో దీపికా పదుకోనే నటించారు. ఈ ట్రైలర్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ట్రైలర్‌పై ప్రముఖ మోడల్, టీవీ యాంకర్ అయిన కేటీ పైపర్ స్పందించారు. స్వయంగా యాసిడ్ బాధితురాలైన ఆమె.. ట్రైలర్‌పై తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా పదుకొనేపై ప్రశంసల వర్షం కురిపించారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు దానిలో లీనమైపోయానని తెలిపారు. మూడు, నాలుగు సార్లు చూశానన్నారు. ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోందని ట్విట్టర్‌లో తెలిపారు. సినిమా ద్వారా సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్నానంటూ దీపికకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక ఆమెను కలవాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. కేటీ ట్వీట్‌పై స్పందించిన దీపిక.. త్వరలోనే తానూ కలుస్తానని మాటిచ్చారు. ట్రైలర్‌పై ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts