telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా దినేష్ కార్తీక్‌…?

ఇంగ్లాండ్‌లోని పోర్ట్ సౌథాంప్టన్‌ క్రికెట్ స్టేడియం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికైంది. ఫైనల్‌లో న్యూజీలాండ్ జట్టును ఢీ కొట్టనుంది టీమిండియా. వచ్చేనెల 18వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభమౌతుంది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్‌ల మ్యాచ్‌ను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా టీమిండియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో అడుగు పెట్టింది. భారత జట్టు ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో న్యూజీలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లూ ఫైనల్‌లో తలపడబోతోన్నాయి. ఇది క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. చారిత్రాత్మకంగా భావిస్తోన్న ఈ మ్యాచ్‌లో న్యూట్రల్ కామెంటేటర్‌గా వ్యవహరించే ఛాన్స్ దినేష్ కార్తీక్‌కు దక్కే అవకాశాలు ఉన్నాయి. లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి ఆయన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా ఎంపిక కావొచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఫైనల్‌లో ఆడబోతోన్న భారత్, న్యూజీలాండ్, దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోన్నందున ఇంగ్లాండ్ నుంచి కామెంటేటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేయనుంది. క్రికెట్ జట్టు తరఫున సునీల్ గవాస్కర్, దినేష్ కార్తీక్‌లను ఐసీసీ ఎంపిక చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే- దినేష్ కార్తీక్ తొలిసారిగా కామెంటరీ బాక్స్‌లో కనిపిస్తాడు.

Related posts