ఈరోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స..ఢిల్లీ కేపిటల్స్ తలపడబోతున్నాయి. గత ఏడాది ఐపీఎల్ ఫైనల్లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగిన విషయం తెలిసిందే. ఇందులో ముంబై ఇండియన్స్‌దే పైచేయి అయింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు ఢిల్లీ కేపిటల్స్‌కు తీపి కబురు అందింది. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ సాధించాడు. ఇషాంత్ పూర్తి ఫిట్‌తో ఉన్నాడని జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. ముంబైతో మ్యాచ్ ఆడటానికి రెడీగా ఉన్నాడని తెలిపింది. మడమల్లో గాయం కారణంగా ఇషాంత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడది నయమైందని జట్టు మేనేజ్మెంట్ ధృవీకరించింది. డెత్ ఓవర్లలో అనుభవజ్ఞుడైన బౌలర్ కొరతను ఎదుర్కోంటోంది ఢిల్లీ కేపిటల్స్. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ దూకుడు ముందు కొత్త బౌలర్లు కాస్త ఒత్తిడికి లోనవుతున్నారని, ఫలితంగా- కీలకమైన డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులను సమర్పించుకోవాల్సి వస్తోందనే అంచనాతో ఉంటోంది. ఇషాంత్ శర్మ అందుబాటులోకి రావడం ఆ కొరతను అధిగమించినట్టవుతుందని భావిస్తోంది.
							previous post
						
						
					
							next post
						
						
					

