కేంద్ర బడ్జెట్లో ఏపీ విభజన హామీల గురించి ఊసే లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. గురువారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ రోజుకు రూ. 17 ఇవ్వడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను అవమానించారని విమర్శించారు.
ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉన్నవి ఊడగొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని గల్లా జయదేవ్ అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని కడతామని చెప్పి, పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే: యనమల