ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారులు అసంతృప్తికి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఇలాంటి నిర్ణయాలతో పరిశ్రమలను ఆకర్షించడం కష్టమని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజక్టును ఏ కాంట్రాక్టర్ నిర్మిస్తున్నారన్నది ఇప్పుడు ముఖ్యం కాదని, పోలవరం ప్రాజక్టు పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని సుజనా హితవు పలికారు.