ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. ధర ఎంత ఉన్నప్పటికీ బంగారం కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే.. తాజాగా బంగారం ధరలు మరోసారి పెరిగిపోయాయి. గత మూడు రోజులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,170 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 44,160 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,830 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 42,010 పలుకుతోంది. బంగారం ధరలు పెరుగుతుంటే వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.71,400 వద్ద కొనసాగుతోంది.
previous post


జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్