telugu navyamedia
క్రీడలు వార్తలు

వైరల్‌ అవుతున్న ధోని కొత్త గెటప్‌.. కారణమిదే

జార్ఖండ్‌ డైనమేట్‌ మహేంద్రసింగ్‌ ధోని…ఈ పేరు తెలియని వారుండరు. ధోని.. టీం ఇండియా మాజీ కెప్టెన్‌. టీం ఇండియా ఎన్నో అద్భుత విజయాలను అందించిన గొప్ప ఆటగాడు. రైల్వే టీసీగా పనిచేసి… టీం ఇండియా కెప్టెన్‌గా ఎదిగిన గ్రేట్ ప్లేయర్‌. క్రికెట్‌ అభిమానులకు ధోని బ్యాటింగ్‌ అంటే ఎంత ఇష్టమో..ఆయన హెయిర్‌ స్టైల్‌ అంటే కూడా యువతో అంతే క్రేజ్‌. ఎప్పుడూ డిఫరెంట్‌ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేస్తుంటాడు. అలాంటి ధోని 2021 ప్రారంభానికి ముందు ఓ కొత్త లుక్‌తో అందరినీ షాక్‌ గురిచేశారు. గుండుతో బుద్ద సన్యాసి అవతారంలో ధోని దర్శనమిచ్చాడు. ధోని కొత్త లుక్‌ చూసిన ఫ్యాన్స్‌… ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ధోని ఆ వేషం ఎందుకు వేశాడో క్లారిటీ వచ్చింది. వివో 2021 ఐపీఎల్‌ ప్రమోషన్‌ కోసం స్టార్‌ స్పోర్ట్స్ ఓ యాడ్‌ రూపొందించింది. ఇందులో ధోని బౌద్ధ సన్యాసిలా శిష్యులకు ఉపదేశం ఇస్తుంటాడు. ఐదు టైటిళ్లు కొట్టినా ఆకలి తీరని రోహిత్‌ గురించి, విరాట్‌ కోహ్లీ దూకుడుతనం గురించి ధోని వారికి వివరిస్తాడు. కాగా.. ప్రస్తుతం ధోని గెటప్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Related posts