పవన్ తేజ్ కొనిదెలను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఈ కథలో పాత్రలు కల్పతం’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఎంవీటీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో మేఘనా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ అనంతరం పనులను చూసుకుంటుంది. ఇక ఈ సినిమా నుండి రెండో లిరికల్ పాట ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు వైస్ షర్మిల విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ఏ పోస్టర్ విడుదల చేసింది. అయితే ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మిస్టరీగా మారిన ఓ కేసును ఛేదించేందుకు హీరో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో హీరో, పోలీసుల నేపథ్యంలో మిగతా కథ నాగుతుంది. ఈ సినిమా టీజర్ అందరికీ థ్రిల్‌ను కలిగిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.
previous post
next post


ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..