telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఎవర్ గివెన్ కు భారీ జరిమానా.. ఏకంగా రూ. 7500 కోట్ల ఫైన్

గత నెల 23 వ తేదీన ‘ఎవర్ గివెన్’ సూయజ్ కాల్వలో భారీ నౌక చిక్కుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నౌక కాల్వలో చిక్కుకోవడం కారణంగా.. వారం రోజులు ఆ కాల్వ నుంచి రవాణా నిలిచిపోయింది. వందల కొద్దీ రవాణా షిప్పులు ఆ ప్రాంతం గుండా వెళ్లేందుకు సముద్రంలో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నౌక సూయజ్ కాల్వలో చిక్కుకోవడం వలన రోజుకు రూ.70 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక దీనిని పూడ్చేందుకు ఈజిప్టు సర్కార్ సిద్దమైంది. కాల్వలో చిక్కుకున్న నౌక యాజమాన్యానికి భారీ జరిమానా విధించింది. $100 కోట్లు చెల్లించాలని ఎవర్ గివెన్ నిర్వహణ సంస్థకు ఆదేశించింది. అది ఇండియా కరెన్సీ లో రూ. 7500 కోట్లు వాణిజ్యపరంగా తీవ్ర నష్టం కలగడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈజిప్ట్ పేర్కొంది. మొత్తం $9 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. నౌక బయటకు తీసిన వారానికి కానీ రవాణా పూర్తి స్థాయిలో జరగలేదని ఈజిప్ట్ వెల్లడించింది.

Related posts