కరోనా కారణంగా ఈ ఏడాది స్కూల్స్, కాలేజీలు ఆలస్యంగా ఈ నెల ఒకటి నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించాయి.. ఇక, ఇవాళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.. సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇవాళ వెల్లడించారు. మే 4వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపిన ఆయన.. బోర్డు పరీక్షల కోసం ఎదురుచూస్తున్న డేట్ షీట్ వచ్చేసిందంటూ.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక, మొత్తం పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్‌ను సీబీఎస్ (cbse.nic.in)లో పొందుపర్చినట్టు తెలిపారు కేంద్రం మంత్రి. సీబీఎస్ఈతో అనుబంధంగా ఉన్న పాఠశాలలు రాబోయే బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి.. చాలా సమావేశాలు, చర్చల తర్వాత మే 4 నుండి పరీక్షలను నిర్వహించాలని డిసైడ్ అయినట్టు తెలిపారు మంత్రి రమేష్ పోఖ్రియాల్.. ఇక, ఫలితాలు జూలై 15 న ప్రకటిస్తామని.. మార్చి 1 నుండి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయని వెల్లడించారు.
previous post
next post


కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా