telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

లూసిఫర్‌ లో నయనతార…?

ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒకవైపు ఆచార్య సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను ప్రకటించి అందరని ఔరా అనిపించాడు. అయితే చిరు వరుస సినిమాలు ప్రకటిస్తున్నాప్పటికీ అందులో హీరోయిన్లు దొరకడం కష్టం అయిపోయింది. హీరోయిన్ల విషయంలో చిత్ర టీం తెగ కష్ట పడుతోంది. అయితే ఇటీవల దర్శకుడిని ఓకే చేసుకున్న మెగాస్టార్ లూసిఫర్ సినిమా ఇప్పుడు హీరోయిన్ వేటలో పడింది. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం నయనతారను ఫిక్స్ చేసినట్లు అంటున్నారు. ఈ సినిమాలో నయనతార ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో కనిపించినుంది. ఈ విషయంపై లూసిఫర్ టీం నయనతారతో సంప్రదింపులు జరుతుందని, చివరి ఒప్పందం ఒక్కటి ఆగిందని అంటున్నారు. ఈ సినిమాకు ఈ స్టార్ హీరోయిన్ రెమ్యునిరేషన్ ఖరారయితే అయిపోయినట్లేనని టాక్ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ట్యాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో కనపించనున్నాడట. ఇక తతిమా పాత్రలను కూడా త్వరలో ఫైనల్ చేయాలని టీం ప్రయత్నిస్తోంది. ఈ సినిమాను రీమేకింగ్ మోహన్ రాజా రూపొందించనున్నాడు.

Related posts