తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది… యాసంగి సీజన్ కోసం ఈ నెల 28వ తేదీ నుంచి రైతు బంధు సాయాన్ని అందజేయాలని నిర్ణయించింది… సోమవారం నుంచి రైతు బంధు సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేశారు.. ఇక, యాసంగి రైతు బంధు కోసం రూ.7,300 కోట్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు విడతల వారీగా రైతు బంధు సొమ్మును… అన్నదాతల ఖాతాల్లో జమ చేసే విధంగా ఈ సారి ఏర్పాట్లు చేశారు అధికారులు.. మొదటగా ఎకరంలోపు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేయనున్నారు.. ఆ తర్వాత రెండెకరాల లోపు పొలం ఉన్నవాళ్లకు.. ఆపై మూడెకరాల లోపు పొలం ఉన్నవారికి.. విడతల వారీగా నగదు జమ చేయనున్నారు. మొత్తంగా జనవరి 7వ తేదీ నాటికి అన్నదాతలందరికీ రైతు బంధు అందించనున్నారు. వర్షాకాలంలో 57.90 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించగా.. ఈ యాసంగిలో అదనంగా 1.70 లక్షల మందికి రైతు బంధు సాయం అందనుంది అని అధికారులు తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					


అప్పులే తప్ప తన వద్ద డబ్బులేమీ లేవు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి