telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ప్రకాష్ రాజ్ పై నటుడు విశాల్ ప్రశంసలు

Prakash Raj Contest Bangalore Central

బెంగుళూరు లోక్ సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై నటుడు విశాల్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో విశాల్ ప్రకాష్ రాజ్ కు తన మద్దతు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవడమనేది చాలా కష్టమని అన్నారు. అందుకు ధైర్యంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం అవసరమని అన్నారు. దానికి సరైన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నిలిచారని చెప్పారు.

సమాజంలో జరిగే మంచి విషయాలను స్వాగతిస్తూ, చెడు విషయాలను ప్రశ్నిస్తున్న వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నిలిచారని పొగడ్తలతో ముంచేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని, లోక్ సభ స్థానంలో ‘విజిల్’ గుర్తుపై పోటీ చేస్తోన్న ఆయనకి తాను ‘విజిల్’ వేసి అభినందిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విజయం సాధించి, ప్రజలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నట్టు విశాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related posts