telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇప్పటినుండే ట్రంప్ ను దూరం పెడుతున్న మెలానియా…

ఈ మధ్యే జరిగిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే, నిన్న వెటరన్స్ డే సందర్భంగా ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికను సందర్శించారు. అమెరికా ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది వెటరన్స్ డేను జరుపుతారు. అయితే, ఈ కార్యక్రమంలో అమెరికన్ ఫస్ట్ లేడి మెలానియా ప్రవర్తించిన తీరు అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది. ఆమె సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కారు. ట్రంప్‌కు దూరంగా.. సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా ఎటువంటి కొవిడ్ రూల్స్ పాటించలేదు.  

ఇదే కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఇవాంక మాత్రం ఫేస్‌మాస్కులతో సామాజిక దూరం పాటిస్తూ కనిపించారు. ట్రంప్ ఫేస్‌ మాస్కు ధరించనప్పటికీ సామాజిక దూరం పాటించారు. సైనికులకు దూరంగా నడిచారు. కానీ, మెలానియా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఓ సైనికుడి చేయి పట్టుకుని అతనికి దగ్గరగా నడిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె సోల్జర్‌కు దగ్గరగా ట్రంప్‌కు దూరంగానే నడిచారు. దీంతో తన వింత ప్రవర్తనతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని మెలానియా ఒకింత షాక్‌ కు గురి చేశారు.  మరోవైపు ట్రంప్‌కు మెలానియా త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయ్. ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలైన ఒమరోసా మానిగోల్ట్ న్యూమాన్ ఈ రూమర్లకు తెరలేపారు. జనవరిలో ట్రంప్ అధ్యక్ష పీఠం దిగగానే  వీరి వివాహబంధానికి శుభం కార్డు పడనుందని న్యూమాన్ చెప్పారు.

Related posts