telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతుల ఆందోళనతో చిక్కులో పడుతున్న కేంద్రం…

punjob farmers

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకి తిరువరం అవుతుంది. దాంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో భేటీ అయ్యారు. కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా, హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి చర్చలే ఉత్తమ మార్గం అని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త చట్టాల వల్ల కొంతమందికి స్వల్పకాలికంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. దీర్ఘకాలంలో మాత్రం ఇవి రైతులకు ప్రయోజనం కలిగిస్తాయన్నారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. తాము చేస్తున్న చట్టాలను వ్యతిరేకించడం విపక్షాలకు అలవాటేనని నిందించారు. చట్టాలకు అనుకూలంగా ఉత్తరాఖండ్‌, హర్యానా నుంచి వచ్చి తనను కలిసిన రైతులు, ప్రజా ప్రతినిధులతో తోమర్‌ మాట్లాడారు. ప్రభుత్వ చర్యల్ని విమర్శించి దేశాన్ని బలహీనపరచడం విపక్షాలకు పరిపాటేనని చెప్పారు. చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల నిరాహార దీక్ష విజయవంతం కావడంతో తర్వాతి కార్యాచరణపై రైతులు సమాలోచనలు జరుపుతున్నారు. ఆందోళనలు మరింత తీవ్రం కాకముందే.. ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. చర్చల ద్వారా రైతుల్ని ఒప్పించవచ్చని కేంద్రమంత్రులు గట్టి నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts