ఈనెల ఒకటిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. రేపు ఈ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓ 17 సంవత్సరాల కుర్రాడు ఎన్నికల విధులు నిర్వహించారన్న వార్త తీవ్ర కలకలం రేపింది.. కనీసం 18 ఏళ్లు కూడా నిండని కుర్రాడిని ఎన్నికల విధులకు ఎలా కేటాయించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం… ఆ 17 ఏళ్ల కుర్రాడికి ఎన్నికల విధులు కేటాయించారనడంలో నిజం లేదన్న ఈసీ.. వాస్తవానికి ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహించడానికి పోలింగ్ కేంద్రంలో నియమించడం జరిగిందని తెలిపింది.. వెబ్ క్యాస్టింగ్ కొరకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమించడం జరుగుతుందని.. వారికి వయస్సుతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే, ఆ కుర్రాడు మధ్యాహ్నం.. భోజనం చేయడానికి మాత్రమే ఇతర పోలింగ్ సిబ్బందితో పాటు కూర్చున్నాడని ఓ ప్రకటనలో పేర్కొంది.. అంతేగాని ఆ అబ్బాయికి ఎన్నికల విధులు కేటాయించామనడంలో ఎటువంటి వాస్తవం లేదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
previous post
next post

