telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మూడు రాజధానుల కేసును విచారించిన హైకోర్టు…

హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు రాజధాని కేసు లపై విచారణ చేపట్టింది.  రైతుల తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు రోజంతా వాదనలు వినిపించారు. రాజధానిలో నిర్మాణాల ఖర్చులపై అకౌంటెంట్ జనరల్ నివేదిక సమర్పించిన పోవడంపై ధర్మాసనం సీరియస్ అయింది. ఇంతవరకు నివేదిక ఎందుకు సమర్పించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది.  వచ్చే సోమవారం లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే అకౌంటెంట్ జనరల్ కోర్టుకు రావలసి ఉంటుంది అని హెచ్చరించింది. రాజధాని నిర్మాణాలకైన వ్యయం, తీసుకొచ్చిన రుణాలు, కాంట్రాక్టు సంస్థల క్లయిమ్ ల వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ నివేదికల్లో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త చట్టం చేయాలని కూడా నివేదికలో లేదని హై కోర్ట్ పేర్కొంది. ఆ నివేదికల ప్రకారమే మూడు రాజధానులు చేశామని ప్రభుత్వం చెబుతుందని అడ్వొకేట్ ఉన్నం మురళీధరరావు పేర్కొన్నారు. అసలు నివేదికల్లో అలా ఎక్కడుందని ప్రశ్నించింది ధర్మాసనం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 37, 38 ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు చేశామన్న వాదనలతో న్యాయవాది మురళీధరరావు విభేదించారు. ఆదేశిక సూత్రాల ప్రకారం రైతులు జీవించే హక్కును కోల్పోకూడదని వాదించారు.

Related posts