telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనాతో మాజీ ముఖ్యమంత్రి మృతి…

కరోనా ఇప్పటికే చాలా మందిని బలితీసుకుంది. తాజాగా అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు ఆయన ప్రస్తుతం గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో పోస్ట్ కరోనా సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి కన్నుమూశారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్ విశ్వకర్మ ఖరారు చేశారు. ఇప్పటివరకు భావిస్తున్న దాని ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని శ్రీమంత శంకర్ దా కళాక్షేత్రం లో ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఆయన మరణవార్త తెలుసుకున్న అస్సాం ముఖ్యమంత్రి తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. డిబ్రూగర్ లో ఉన్న ఆయన గౌహతికి హుటాహుటిన బయలుదేరారు. ఆయన నాకు తండ్రి లాంటి వారని ఆయన కోలుకోవాలని గతంలో ఆయన ట్వీట్ చేశారు. ఆగస్టు చివరి వారంలో గగోయ్ కి కరోనా సోకింది. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించడంతో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తే ఆయన కోలుకున్నారు. అయితే నాకు పోస్ట్ కరోనా సమస్యలు తలెత్తడంతో ఆయన్ని గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చేర్పించారు. చేర్పించిన నాటి నుంచి ఆయన బలము ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. ఆయన అస్సాం రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 84 వేల ఏళ్ళ వయసున్న ఆయన ఆయనకు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Related posts