telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదు: చంద్రబాబు

tdp chandrababu

అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదని ఆ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తమ కార్యకర్తలపై దాడులు చేయడం మంచిది కాదని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. ముప్పై ఏడు సంవత్సరాలుగా టీడీజీ జెండాను తమ కార్యకర్తలు మోస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలోని ఏ కార్యకర్త కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తమకు అరవై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, తాము ఎక్కడా దౌర్జన్యం చేయడం లేదన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలకు మంచి పనులు చేస్తామని వైసీపీ చెప్పిందని, ఆ పనులు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని చేస్తే, తాము కూడా సహకరించాలని అనుకున్నామని అన్నారు. ప్రజల ప్రాణాలకు వారి ఆస్తులకు అన్ని విధాల పభుత్వం భరోసా కల్పించాలని పేర్కొన్నారు.

Related posts