telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తుంగభద్ర పుష్కారాలకు సర్వం సిద్ధం…ప్రారంభించనున్న జగన్‌

తుంగభద్ర పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పవిత్రమైన పుష్కరాలు ఇవాళ మధ్యాహ్నం 1:21 గంటలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గతంలో 2008 లో తుంగభద్ర పుష్కరాలు సాగగా… ఈ ఏడాది 20 నుంచి డిసెంబర్‌ 1 వరకూ అంటే 12 రోజులు ఈ పుష్కరాలు జరగనున్నాయి. తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ ‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లాలోని సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద ఇవాళ శాస్త్రోకంగా జరిగే కార్యక్రమాల్లో జగన్‌ మోహన్ ‌రెడ్డి పాల్గొంటారు. ఇక పుష్కరా కోసం కర్నూలు జిల్లాలో 23 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా నదీ స్నానాలకు బదులుగా జల్లు స్నానాలు చేయాలని భక్తులకు సూచించింది ప్రభుత్వం. అయితే.. పిండ ప్రదానాలకు అవకాశం కల్పించింది. ఈ- టికెట్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది. ఈ-టికెట్‌ వెబ్‌సైట్‌ (https://tungabhadra pushkaralu 2020.ap.gov.in)ను మంత్రులు బుగ్గన, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌లో ప్రారంభించారు.

Related posts