శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు.
ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు.
వీరిద్దరు పోచారంతో భేటీ అయ్యారు. అనంతరం పోచారం నివాసానికి కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు.
నేడో, రేపో పోచారం కాంగ్రెస్ లో చేరతారనే చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ నివాసానికి వెళ్లారనే విషయం తెలియగానే పోచారం నివాసానికి బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు వెళ్లారు.
పోచారం నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
వైసీపీ నేతలు చెబితేనే కార్యాలయాల్లో పనులు: చంద్రబాబు