*శ్రీకాకుళం జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం..
*అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఇన్నోవా..
*8 మందికి గాయాలు..5మంది పరిస్థితి విషమం
శ్రీకాకుళంలోని సోంపేట మండలంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పలాసపురం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఇన్నోవా అర్ధరాత్రి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
ఈ ఘటన విశాఖ జిల్లాలోని సింహాచలం నుండి శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
శనివారం అర్ధరాత్రి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.