telugu navyamedia
సినిమా వార్తలు

67 సంవత్సరాల “సంకల్పం”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాధనా ఫిలిమ్స్ వారి “సంకల్పం” 19-06-1957 విడుదలయ్యింది.

దర్శక, నిర్మాత సివి.రంగనాధదాస్ గారు సాధనా ఫిలిమ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి, పాటలు: అనిశెట్టి సుబ్బారావు, సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్, కళ: టి.వి.ఎస్.శర్మ, ఎడిటింగ్: అక్కినేని సంజీవి అందించారు

ఈ చిత్రంలో ఎన్.టి రామారావు, కుసుమ కుమారి, రమణారెడ్డి, రాజసులోచన, రేలంగి, గిరిజ, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత సారధ్యంలో
“కనుగీటి పిలిచె కలలోన వలచె”
“వెన్నెల తెలికాంతులలో చల్లగాలి దారులలో”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలు కేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు (50 రోజులు) జరుపుకున్నది.
విజయవాడ – శ్రీరామా టాకీస్ లో
56 రోజులు ప్రదర్శింపబడింది…..

Related posts