telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసుపై అక్షయ్ కుమార్ ఎమోషనల్ పోస్ట్

Akshay-Kumar

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బయటికి రావడం, వారిపై లోతుగా విచారణ చేపడ్డటం లాంటివి చకచకా జరిగిపోయాయి. మరోవైపు నిజానిజాలు ఏంటనేది తేలకముందే చిత్రసీమపై సోషల్‌మీడియాలో విమర్శనాత్మక వార్తలు వెల్లువెత్తున్నాయి. దీనిపై అక్షయ్‌ రియాక్ట్ అవుతూ ఆవేదన చెందారు. “మేమంతా దేశ ప్రజల మనోభావాలను తెరపై చూపించే ప్రయత్నం చేస్తుంటాం. సమాజంలోని బాధలను తెరపైకి తెచ్చి చూపిస్తుంటాం. కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా దయచేసి అసత్య ప్రచారాలు మానుకోండి. బాలీవుడ్‌లో ఈ సమస్య లేదని చెప్పను గానీ అందరినీ ఒకే గాడిన కట్టేసి చూడకండి. అది చాలా తప్పు. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా.. మొత్తం చిత్ర పరిశ్రమను చెడుగా చూడకండి” అంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఎన్‌సీబీపై అధికారులపై నమ్మకం ఉందని, డ్రగ్స్ కేసు విచారణకు అందరూ సహకరిస్తామని అక్షయ్ తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి సమస్య తలెత్తిన తర్వాత మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చిత్ర పరిశ్రమలో వేధింపులు, డ్రగ్స్‌ వాడకం లాంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అర్థమైందని తెలిపారు.

Related posts