telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వకీల్ సాబ్’కు వర్మ పంచ్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మాణంలో.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ సినిమా తెరకెక్కుతోంది.అమితాబ్ నటించిన ‘పింక్’ సినిమా రీమేక్‌లో ‘లాయర్ పాత్ర’లో పవన్ నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్‌సాబ్’ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో పంచ్ వేశారు. అచ్చం పవన్ లాగా కూర్చొని డైరెక్టర్ సాబ్ అనే ఫొటోకు ‘‘వకీల్ సాబ్’’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జత చేసి ‘I don’t think some idiot did not do this non idiotic thing’ ‘‘నేను కొంతమంది ఇడియట్స్ గురించి ఆలోచించను.. ఇలాంటి ఇడియట్ పనులను చేయను’’ అంటూ ట్వీట్ చేశారు. కొంతమంది మాత్రం ఓ రేంజ్‌లో వర్మని ఆడేసుకుంటున్నారు.

Related posts