విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం కవిరత్నా మూవీస్ వారి
“విశ్వరూపం” 25-07-1981 విడుదలయ్యింది.
ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సమర్పణలో కె. భానుప్రసాద్ నిర్మాతగా కవిరత్నామూవీస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు: దాసరి నారాయణరావు, పాటలు: కొసరాజు, రాజశ్రీ, దాసరి నారాయణరావు, వేటూరి సుందర రామమూర్తి, సంగీతం: చక్రవర్తి, సినిమాటోగ్రఫీ: కె.ఎస్.మణి, కళ: భాస్కరరాజు, నృత్యం: పి.ఏ.సలీం, ఎడిటింగ్: కోటగిరి గోపాలరావు అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, జయసుధ, అంబిక, రావు గోపాలరావు, సత్యనారాయణ, కాంతారావు,
అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, ప్రసాద్ బాబు, ఈశ్వరరావు, ఆర్ .నారాయణ మూర్తి, సుకుమారి, సుభాషిణి, రాళ్ళబండి, హరిప్రసాద్, అనిత తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరకల్పన లో పాటలన్నీ హిట్ అయ్యాయి..
“నూటికో కోటికో ఒక్కరూ.. ఎప్పుడో ఎక్కడో పుడతారు”
“యువకుల్లారా లేవండి యువతను నిద్దుర లేపండి…”
“కనులు చాలవు, కలము చాలదు,”
“కీచు కీచు పిట్ట నెలకేసి కొట్ట”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
ఎన్.టి.రామారావు గారు, దాసరి నారాయణ రావు గారి కాంబినేషన్ లో రూపొందిన నాల్గవ చిత్రం ‘విశ్వరూపం’.
ఈ చిత్రాన్ని ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి నిర్మించడం విశేషం.
ఈ చిత్రం ఆశించిన మేరకు విజయవంతం కాలేకపోయింది. ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలు కేంద్రాలలో 50 రోజులు, 5 కేంద్రాలలో (విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు) 100 రోజులు ఆడింది…
100 రోజుల కేంద్రాలు:–
విజయవాడ — శాంతి ధియేటర్ + షిఫ్ట్ తో రామ్ గోపాల్,
విశాఖపట్టణం – రాజ్ కమల్ (48 రోజులు) + షిఫ్ట్
రాజమండ్రి. — యమున ధియేటర్ + షిఫ్ట్
గుంటూరు- భాస్కర్ డీలక్స్ (40రోజులు) + షిఫ్ట్
హైదరాబాద్ – ప్రభాత్ (41 రోజులు) + విజయలక్ష్మి ధియేటర్.(షిఫ్ట్).
విజయవాడ(గుణదల)- రామ్ గోపాల్ ధియేటర్ లో శతదినోత్సవ వేడుకలు జరిగాయి.


ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం… బాలకృష్ణ వ్యాఖ్యలపై సి.కళ్యాణ్