telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు

augstu calender

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులతో పాటు మరో రోజు మహిళా ఉద్యోగులకు కలిసి రానుంది. శ్రావణ మాసం ఆరంభం కావడంతో.. ఈ శుక్రవారం(ఆగస్టు 9) మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. దీంతో మెజార్టీ మహిళా ఉద్యోగులు ఆ రోజు సెలవు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా మహిళలకు నాలుగు రోజులు సెలవులు కలిసి రానున్నాయి. ఇక మిగితా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆగస్టు 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న బక్రీద్ సెలవులుగా ఉన్నాయి.

Related posts