వైసీపీ పాలనలో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రక్షణ లేదు
దిశ చట్టం టీడీపీ నేతలపై కాదు మహిళలపై అత్యాచారాలు చేసే వారిపై ఉపయోగించండి
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా?
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నాగులగడ్డం తండాకు చెందిన వాలంటీర్ కిరణ్ ఎస్టీ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్బవతిని చేసి మోసం చేయడమే కాక, ఆయువతి కుటుంబంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాలంటీర్ కిరణ్ పై దిశ చట్టం కింద నమోదు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పెళ్లిళ్లకు హాజరైన టీడీపీ నేతలపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదు? నిందితునిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత యువతికి న్యాయం చేయాలి. ప్రజలకు సేవ చేయాల్సిన వాలంటీర్లు మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం దుర్మార్గం. వాలంటీర్ల అరాచకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఏడాదిలోనే సుమారు 300 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 38.5 శాతం మహిళలపై వేధింపులు పెరిగాయి. ఒక మహిళ హోమ్ మంత్రి గా వున్న రాష్ట్రం లో మహిళల పై ఈ విధమైన దాడులు జరగడం సిగ్గు చేటు.మహిళల పై అత్యాచారాలకు పాల్పడుతున్న వైకాపా నాయకులను ప్రభుత్వం కాపాడటం అంటే మహిళల రక్షణ పట్ల ప్రభుత్వానికి ఎంత భాధ్యత వుందో అర్ధం అవుతుంది. దిశ చట్టం తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమంది నిందితులను శిక్షించింది?
వైసీపీ పాలనలో గిరిజనులకు, దళితులకు, బలహీనవర్గాలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీ నేతలు వారిపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇది గిరిజన, దళిత, బలహీనవర్గాల వ్యతిరేక ప్రభుత్వం. జనం ముందు జగన్ పనులు మేడిపండు అంత అందంగా ఉంటాయి, జనం వెనుక చేసే చేష్టలు పొట్ట విప్పి చూస్తే కనబడేంత పురుగులంత అసహ్యంగా ఉంటాయి. రాష్ర్టంలో నెలకొన్న పరిస్ధితులు చూస్తుంటే రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా? రాక్షసులు పాలిస్తున్నారా ?అన్న మానం కలుగుతుంది.జగన్ పాలన అనుభవరాహిత్యం,రాజకీయ పరిణితి లోపించి అహంకారం, ప్రతీకారం,నియంతృత్వంగా సాగుతోంది. రాష్ర్టంలో పరిస్థితులు బీహార్ కన్నా ఘోరంగా ఎమెర్జెన్సీ ని తలపిస్తున్నాయి.
s/d
బండారు శ్రావణి
శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్

