telugu navyamedia
రాజకీయ వార్తలు

గెహ్లాట్‌పై ఏడాది కాలంగా పోరాడుతున్నా: సచిన్ పైలట్

sachin poilet rajastan

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుబాటు నేత సచిన్ పైలట్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నుంచి తాను ఎలాంటి ప్రత్యేక అధికారాలను కోరుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు.

రాజస్థాన్ అభివృద్ధికి పాటుపడుదామనుకుంటున్న తనను, తన అనుచరులను గెహ్లాట్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన వద్దకు ఫైళ్లు పంపవద్దని, తన మాట వినవద్దని అధికారులకు సూచిస్తున్నారని అన్నారు. ప్రజలకు తానిచ్చిన హామీలు నెరవేర్చకుంటే తనకు వారెలా విలువ ఇస్తారని పైలట్ ప్రశ్నించారు.

బీజేపీతో కలిసి రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సచిన్ కొట్టిపడేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయిన తర్వాతి నుంచి గెహ్లాట్ మద్దతుదారులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం ఏడాది కాలంగా గెహ్లాట్‌తో తాను పోరాడుతూనే ఉన్నానని సచిన్ వివరించారు.

Related posts