ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశాం. తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ మహిళా సాధికారితపై మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాలి.
టీడీపీతోనే మహిళా సాధికారిత ప్రారంభమైంది మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారు అని అన్నారు.
తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారు ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారు.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు అని అన్నారు.
తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది అని తెలిపారు.
ఆడబిడ్డ పుడితే రూ.5 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం, డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారు అన్నారు.
పురుషులకంటే మహిళలే తెలివైనవాళ్లు దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మహిళలు చదువుకోకున్నా లోకపరిజ్ఞానంలో ముందుంటారు. డ్వాక్రాలో మహిళలు రూపాయి పొదుపు చేస్తే నేనూ రూపాయి ఇచ్చాను అన్నారు.
డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తాం రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు.
భూమి అంటే సెంటిమెంట్ భూమిని ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడరు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు అని తెలిపారు.
అమరావతి బతికి ఉందంటే అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. డ్వాక్రా మహిళలకు రూ.8,500 కోట్లు రుణమాఫీ చేశాం, పసుపు, కుంకుమ కింద రూ.10 వేల చొప్పున రూ.9,689 కోట్లు ఇచ్చాం అన్నారు.
వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం. మహిళలకు భద్రత, నమ్మకాన్ని కలిగించాం, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.238 కోట్లు ఇచ్చాం.
మహిళా వీధి వ్యాపారుల కోసం రూ.235 కోట్లు సహాయం చేశాం దాదాపు 8 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి.
సుమారు 88 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు ఈ ఏడాది రూ.33 వేల కోట్లు రుణాలు తీసుకుంటున్నారు. సఖి నివాస్ పేరుతో 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేశాం అన్నారు.
ఎన్టీఆర్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా కుట్టు మిషన్ల వంటి శిక్షణ ఇస్తున్నాం.
మహిళా సాధికారతతోనే స్థిరమైన అభివృద్ధి. డ్వాక్రా, మెప్మా సంఘాలను లక్షాధికారులను చేస్తామని మాట ఇచ్చాం.
పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రపంచమంతా అరకు కాఫీని రుచి చూస్తోంది మన అసెంబ్లీలో కూడా అరకు కాఫీ స్టాల్ పెట్టాల్సిన అవసరం ఉంది.
అరకు కాఫీ క్వాలిటీకి గ్యారంటీని నేను ఇస్తున్నా అన్నారు.
వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు శిక్షణ మన ఆడబిడ్డలు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాం.
ఆడబిడ్డల జోలికొస్తే వదిలిపెట్టేది లేదు లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి శిక్షిస్తాం అన్నారు.
ఏపీ ని గంజాయి, డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారుచేస్తాం అని అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగించారు.