ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం టోర్నీని భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలో జరగదెమోనని మదనపడుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనా మరల విజృంభించకుంటే టోర్నీని భారత్‌లోనే నిర్వహిస్తామని గంగూలీ స్పష్టం చేశారు.
టోర్నీ భారత్‌లోనే నిర్వహించినప్పటికీ వేర్వేరు వేదికలలో మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదని గంగూలీ తెలిపారు. మ్యాచ్‌లన్నింటినీ మహారాష్ట్రకే పరిమితం చేయనున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని వాంఖడే, పూణే స్టేడియాలలో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. కాగా నాకౌట్ వేదికలను తర్వాత నిర్ణయించనున్నట్లు గంగూలీ తెలిపారు. అలాగే ఈ ఏడాది రెండు దశల్లో జరగనున్న రంజీ ట్రోఫీపై కూడా గంగూలీ స్పందించారు.
గంగూలీ వ్యాఖ్యలు ప్రస్తుతం ఐపీఎల్ అభిమానులను సంతోషపరుస్తున్నాయి.
కేసులు లేకుండా చంద్రబాబు ప్లాన్.. అందుకే బీజేపీలోకి పంపిస్తున్నారు: సి.రామచంద్రయ్య