అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రం ‘నిశ్శబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘నిశ్శబ్దం’లో మాటలురాని, వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా అనుష్క కనిపించింది. క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో అనుష్క నిరాశ చెందింది. ఇది ఇలా ఉండగా తాజాగా అనుష్క పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వర స్వామిని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం వచ్చిన అనుష్క తన సహచరులతో ఉదయం తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం చేరుకుని అక్కడి నుంచి మరోబోలుపై మహానందీశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. పూజల అనంతరం తిరిగి అదే బోటుపై వెనుదిరిగారు.