telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అడుక్కునే వ్యక్తితో ప్రాంక్… చేద్దామనుకుంటే… అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి…!?

Youtuber

యూట్యూబ్ లో ప్రాంక్ పేరుతో ఇటీవల ఓ వ్యక్తి ప్రాణాలను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ విషయం మరువకముందే తాజాగా స్పెయిన్‌కు చెందిన ఓ యువకుడు రోడ్డుమీద అడుక్కునే వ్యక్తితో ప్రాంక్ చేసి జైలు పాలయ్యాడు. కంగ్వా రెన్ అనే యువకుడు యూట్యూబ్‌లో రెసెట్ అనే పేరుతో యూట్యూబ్‌లో ప్రాంక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మాడ్రిడ్‌లో తాను నివాసముంటున్న ప్రాంతంలో ఓ అడుక్కునే వ్యక్తితో ప్రాంక్ చేద్దామని అతనికి ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. ఆకలితో ఉన్న ఆ వ్యక్తి వెంటనే ఆ బిస్కెట్లు తిని వాంతు చేసుకున్నాడు. బిస్కెట్లలో క్రీమ్ తీసేసి.. ప్రాంక్ చేద్దామని టూత్‌పేస్ట్‌ను పెట్టడం వల్ల వ్యక్తి బిస్కెట్ తిన్న వెంటనే కక్కేశాడు. ఈ వీడియోను తన ఛానల్‌లో పెట్టగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ ఒక్క వీడియో ద్వారా జనరేట్ అయిన యాడ్స్ వల్ల రెండు వేల యూరోస్ (రూ. లక్షా 54 వేలు) ఆదాయం కూడా వచ్చింది. ఈ వీడియో ద్వారా రెసెట్‌ను పట్టుకున్న పోలీసులు తనను కోర్టులో హాజరుపరిచారు. హింస లేకుండా తప్పు చేస్తే స్పెయిన్ చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్షను విధిస్తారు. రెసె‌న్ చేసిన తప్పుకు 15 నెలల శిక్షను కోర్టు విధించింది. బాధితుడికి 22,300 డాలర్ల (రూ.15 లక్షల 42 వేలు) నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది.

Related posts