నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నెల్లూరులోగల వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో అధికారులను బెదిరించారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదైంది. అనంతరం శనివారం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్‌రెడ్డి నెల్లూరులోని వైకాపా కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్‌కు నిరసనగా కార్యాలయం ముందు శ్రీధర్‌రెడ్డి భైఠాయించారు. దీంతో వైసీపీ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అరెస్ట్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీస్ కేసు నమోదు కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
previous post
ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా: లోకేశ్ ఫైర్