telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గుంటూరులో మగాడికి వితంతు పెన్షన్…

Pension

గుంటూరు జిల్లాలో ఓ అనూహ్యమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దు పెంట గ్రామానికి చెందిన హరిజన ఖాశీం కూలీ. ఉపాధి కోసం గుంటూరు జిల్లా వినుకొండ వచ్చాడు. ఈపూరు మండలం చిట్టాపురం చుట్టుపక్కల పొలాల్లో మిరప కోతలకు వెళ్లేవాడు. ఈనెల 3న పింఛను కోసం చిట్టాపురం వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళ్లాడు. అయితే ఖాశీం చూపించిన పెన్షన్ కార్డు చూసిన వెల్ఫేర్ అసిస్టెంట్ షాక్ తిన్నాడు. ఖాశీం వితంతు పెన్షన్ కార్డు చూపించడంతో ఆశ్చర్యపోయాడు. పొరపాటు ఏదైనా జరిగిదేమో అని ఆన్ లైన్ లో పెన్షనర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేశారు. ఖాశీం వయసు 58 ఏళ్లు కావడంతో వృద్ధాప్య పింఛన్ కూడా వచ్చే అవకాశం లేదు. దీంతో వితంతు పింఛన్ ఎవరు మంజూరు చేశారని వెల్ఫేర్ అసిస్టెంట్ హనుమంతు ప్రశ్నించాడు. అయితే ఖాశీం పొంతన లేని సమాధానాలు చెప్పడం తో పాటు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వెంటనే వితంతు పెన్షన్ కార్డు గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Related posts