telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు .. నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

village Secretariat will provide all schemes to

ఏపీ ప్రభుత్వం మరోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. గ్రామ సచివాలయాల్లో 14,061 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 2146 పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇవాళ్టి (జనవరి 11) నుంచి ఈ నెల 31 వరకూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. గ్రామ సచివాలయాల్లో… పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఎస్ (మహిళలు), విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్లు, విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లు, విలేజ్‌ సర్వేయర్‌, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, పశుసంవర్థక అసిస్టెంట్ల పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. అలాగే పట్టణ, వార్డు సచివాలయాల్లో… వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, ఎమినిటీస్‌, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌, వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీలు పోస్టుల్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది.

పూర్తి వివరాల్ని గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో ఉంచామన్న ప్రభుత్వం… ఏ డౌట్ ఉన్నా… అందులో తెలుసుకోవచ్చని చెప్పింది. ఇంకా డౌట్ ఉంటే… గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకోమని చెప్పింది. ప్రభుత్వం కొత్తగా మరో 300 సచివాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిలో 3000 ఉద్యోగాల్ని భర్తీ చేయాలనుకుంటోంది. అందువల్ల అభ్యర్థులు చక్కగా ప్రిపేర్ అయ్యి… జాబ్ కొట్టాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. మొత్తం ఖాళీ పోస్టుల్లో అత్యధికంగా వెటర్నరీ (పసు సంవర్ధక) విభాగంలో 7 వేల వరకూ ఉన్నాయి. హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 1746, విలేజ్ సర్వేయర్ పోస్టులు 1234, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1122 ఉన్నాయి. కాబట్టి… ఈ విభాగాల్లో ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే… సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.

Related posts