telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ తో కోలీవుడ్ స్టార్?

Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ “పింక్” తెలుగు రీమేక్ “వకీల్ సాబ్”, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం తాలూకా ఒరిజినల్ వెర్షన్ లో పవన్ రోల్ కు గాను ఒక ఫిమేల్ లీడ్ ఉంటుంది అది కూడా చాలా తక్కువ నిడివితోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రోల్ సాయి పల్లవి చేస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇపుడు మరో ఆసక్తికర అంశం విపరీతంగా హాట్ టాపిక్ అవుతుంది. ఈ చిత్రంలో పవన్ రోల్ తూ పాటు మరో ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దగ్గుబాటి రానా, కన్నడ నటుడు సుదీప్, నితిన్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతితో చిత్ర యూనిట్ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ‘సైరా’లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

Related posts