telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను చంపేసినా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ .. విడుదల ఖాయం.. : వర్మ

Ram gopal Varma Fire Censor board

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలు వర్మ పంచుకున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సబ్జెక్ట్ మీద నేను ముందుగా ఆసక్తి కలిగి లేను. రంగీలా షూటింగ్ లో ముంబాయిలో ఉన్నప్పుడు, ఫస్ట్ టైమ్ ఈ సబ్జెక్ట్ నాకు బాలయ్య గారితో బయోపిక్ మీద డిస్కస్ చేసినపుడు ఫోకస్ దీనిమీదకు వచ్చింది. అప్పుడు దాంట్లో గ్రేట్ మెటీరియల్ ఉందనిపించింది అని చెప్పాడు.

నన్ను ఎన్టీఆర్ బయోపిక్ తీయమంటే ఉన్నది ఉన్నట్టుగా తీసేవాడిని. కానీ అలా తీస్తే దాదాపు ఎవరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటె ఆయనను చూస్తే పుట్టడమే రాముడిగా, కృష్ణుడిగా పుట్టాడు అనిపిస్తుంది. అందువల్ల సినిమాలో బిలీవబుల్ ఫ్యాక్టర్ తక్కువ పెట్టాల్సి వస్తుంది. అది నాకు పెద్దగా నచ్చలేదు. నేను అయితే రెండు భాగాలు కలిపి మొత్తం అరగంటకో, గంటకో కుదించి, ఈ లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను కీలకంగా జోడించి వుండేవాడిని. ఇంకా మాట్లాడుతూ ఈ సినిమా ను బయటికీ రాకుండా ఎవరు ఆపలేరు. ఒకటి నన్ను ఎవరైనా చంపేయాలి. అయినా దానికి కూడా ఓ మార్గం ఆలోచించి వుంచాను. ఓ హార్డ్ డిస్క్ లో అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూ ట్యూబ్ లో పెట్టాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవరూ ఆపేయలేరు.

Related posts