telugu navyamedia
సినిమా వార్తలు

“ఎన్జీకే” : “వడ్డీలోడు వచ్చెనే… వీడియో సాంగ్

NGK

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం “ఎన్జీకే”. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రభు నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేశారు. “వడ్డీలోడు వచ్చెనే… గడ్డి కోసం చూసెనే…” అంటూ చంద్రబోస్ రాసిన పాటను సత్యన్ పాడారు. ఈ పాటకు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం చాలా విభిన్నంగా ఉంది. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలని భావించారు చిత్రబృందం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మే 31న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Related posts